వైఎస్సార్ పింఛను కానుక పథకం కింద సామాజిక భద్రత పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటికే కుటుంబంలో ఒక వ్యక్తి పింఛను పొందుతున్నా... 80 శాతం వైకల్యం కలిగిన వారు ఉంటే వారికి రెండో పింఛను ఇవ్వనున్నారు. డయాలసిస్ రోగులు, తీవ్ర మానసిక సమస్యలు ఉన్నవారు, ఎయిడ్స్ రోగులకు అదనంగా సాయం అందిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం వైఎస్సార్ పింఛను కానుక కింద ఇది వరకే వచ్చిన మార్గదర్శకాల్లో మార్పులు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12వేల లోపు కుటుంబ ఆదాయం కలిగి ఉండటం అర్హతగా పేర్కొంది. వయసు నిర్ధారణకు ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకుంటారు. మూడు ఎకరాల మాగాణి లేదా 10ఎకరాల లోపు మెట్టభూమి లేదా మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాలున్నా సాయాన్ని అందిస్తారు. ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో ఉన్నవారికి పింఛను మంజూరు చేస్తారు.
పింఛను అర్హత వయసు 60 ఏళ్లకు తగ్గింపు - ఫించను అర్హత వయసు 60 ఏళ్లకు తగ్గించిన ప్రభుత్వం వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు తీపికబురు తెలిపింది. పింఛను అర్హత వయసును 60 ఏళ్లకు తగ్గించింది. కుటుంబంలో ఒక వ్యక్తి పింఛను పొందుతున్నా...80 శాతం వైకల్యం కలిగిన వారు ఉంటే వారికి రెండో పింఛను ఇవ్వనున్నారు.
వైఎస్సార్ పింఛను కానుక
ఇంట్లో వృద్ధాప్య, చేనేత, మత్స్యకార, కల్లుగీత, దివ్యాంగుల పింఛను పొందుతున్న వారు మరణిస్తే ఆ కుటుంబానికి ఊతం ఇచ్చేలా భార్యకు వితంతు పింఛను కింద సాయం అందిస్తారు. తలసేమియా, సికెల్‌సెల్ ఎనీమియా, హిమోపీలియా, పక్షవాతం, తీవ్ర మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు పింఛను అందిస్తారు.
ఇదీ చదవండి:సభలో సీఎం అసత్యాలు చెబుతున్నారు: చంద్రబాబు
TAGGED:
pension news