కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 200 జిలెటిన్ స్టిక్స్, 200 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సైదులును అరెస్ట్ చేశారు. సైదులు తెలంగాణలోని కోదాడ మండలానికి చెందిన వాడిగా గుర్తించారు. మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు.
గరికపాడు చెక్‌పోస్టు వద్ద జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు పట్టివేత.. తెలంగాణ వాసి అరెస్ట్ - కృష్ణాజిల్లా తాజా వార్తలు
జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 200 జిలెటిన్ స్టిక్స్, 200 డిటోనేటర్లను పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు వెల్లడిస్తున్న సీఐ