కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. కరోనా సోకి చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులు.. ఆసుపత్రుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. అలాంటి వారికి స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేస్తూ మానవత్వం చాటుతున్నాయి.
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో.. మూడు స్వచ్ఛంద సంస్థలు నిత్యం వందల మంది ఆకలి తీరుస్తున్నాయి. కష్టకాలంలో తమ వంతు బాధ్యతగా నలుగురికి సాయం చేస్తోన్నామంటున్న సంస్థ ప్రతినిధులతో ఈటీవీ భారత్ ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.