రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇసుక విధానాన్ని నిరసిస్తూ తెదేపా నాయకులు ఆందోళనలు నిర్వహించారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా విజయవాడ గొల్లపూడి సెంటర్లో తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టగా... పోలీసులు అడ్డుకున్నారు. గొల్లపూడిలోని ఆయన నివాసం నుంచి తెదేపా కార్యకర్తలతో ధర్నా నిర్వహించేందుకు రాగా.. భవానీపురం పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం గృహనిర్బంధం చేశారు. దీంతో స్థానిక తెదేపా కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వెంటనే ప్రభుత్వం ఇసుక విధానం, రాజధానిపై స్పష్టత ఇవ్వాలనన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ పరిపాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకకొరతపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నాచౌక్లో బుద్ధ వెంకన్న, దేవినేని అవినాష్, బోండా ఉమా తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
గృహనిర్బంధంలో మాజీ మంత్రి దేవినేని ఉమ
ఇసుక కొరతను విధానాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నాయకులు నిరసనలు చేపట్టారు. విజయవాడలో ధర్నాలో పాల్గొన్న మాజీమంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని.. గృహనిర్బంధం చేశారు.
former minister devineni uma home arrested by police in gollapudi at vijayawada krishna district