కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాల్లో జలవనరుల శాఖ అధికారులు పర్యటించారు. విజయవాడ పరిసరాల కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో ఇసుక బస్తాలు వేసి కరకట్టలను పటిష్ఠ పరిచి ముంపు రాకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. నగరంలోని కృష్ణలంక, రాణిగారితోట, తారకరామానగర్, రణదీవెనగర్, భూపేష్ గుప్తా నగర్, కోటినగర్, ఈనాడు కాలనీ, రామలింగేశ్వర నగర్, యనమలకుదురు వరకు గల కృష్ణానది ప్రాంతాలను అధికారులు పర్యవేక్షించారు. కృష్ణలంక వరద కరకట్టకు అలాగే నది మార్జిన్, రిటైనింగ్ వాల్, యనమలకుదురు ర్యాంప్ వరకు పటిష్టపరచవలసిన ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం క్రిందిస్థాయి సిబ్బందికి సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈఈ శ్రీనివాసరావు, ఏఈ శ్రీనివాసరావు, వర్క్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల పర్యటన - కరకట్ట ప్రాంతాలను సందర్శించిన జలవనరుల శాఖ అధికారులు
ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరును సముద్రంలోకి విడుదల చేయడం వల్ల కరకట్ట ప్రాంతాలను జల వనరుల శాఖ అధికారులు పర్యవేక్షించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చర్యలు చేపట్టారు. కింద స్థాయి సిబ్బందికి సూచనలిచ్చారు.
కరకట్ట ప్రాంతాలను పర్యటించిన జలవనరుల శాఖ అధికారులు