గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత భారతీయులు ఆచరిస్తున్న తీరు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని సోమువీర్రాజు అన్నారు. దేశాన్ని ఒక తాటి పైకి తీసుకుని రావడం.. ప్రధాని మోదీ గొప్ప పాలనకు నిదర్శనమని కొనియాడారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు మంచి పనులతో అభివృద్ధిని అంది పుచ్చుకోవాలని.. ఇందుకు తమ పార్టీ సహకరిస్తుందని సోము వీర్రాజు అన్నారు.
భాజాపా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు - రిపబ్లిక్ డే తాజా వార్తలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారత్ రాజ్యాంగ విధానాలు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని అన్నారు.
భాజాపా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు