రాష్ట్రంలో కరోనా రోజురోజు విజృంభిస్తోంది. ప్రభుత్వం మరికొన్ని కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటుచేస్తోంది. అనంతపురం, కర్నూలు, కడప, రాజమండ్రి, ఒంగోలు బోధనాసుపత్రులు సహా ఏలూరు ఆశ్రమ వైద్యకళాశాలలను రాష్ట్రస్థాయి కొవిడ్ ఆసుపత్రులుగా మారుస్తున్నట్లు వైద్యవిద్య అదనపు సంచాలకులు రాంప్రసాద్ తెలిపారు. వైరస్ కేసులు పెరుగుతున్నందున అదనంగా గుర్తించిన 5 కొవిడ్ ఆసుపత్రులలో ఐసీయూ తదితర వసతులతోపాటు వైద్యులు పారా మెడికల్ సిబ్బందిని సైతం పెంచుతామని ఆయన తెలిపారు.
ఐదు రాష్ట్ర స్థాయి కొవిడ్ ఆసుపత్రులివే...!
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున ప్రభుత్వం వైరస్ కట్డడికి చర్యలు చేపడుతోంది. కరోనా బాధితులు పెరుగుతున్నందున 5 బోధనాసుపత్రులను..కొవిడ్ ఆసుపత్రులుగా మారుస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో కొవిడ్ ఆసుపత్రులు