విజయవాడ న్యూరాజేశ్వరిపేటలోని షిరిడి సాయి ఆలయ ప్రథమ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త దోనేపూడి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా విగ్రహానికి వెండి కిరీటాన్ని అలంకరించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వేడుకలో రాష్ట్ర సమాచార కమిషనర్ ఐలాపురం రాజయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వైభవంగా షిరిడి సాయి ఆలయ ప్రథమ వార్షికోత్సవం - బాబా ఆలయంలో కేశినేని పూజలు
విజయవాడ న్యూరాజేశ్వరిపేటలోని షిరిడి సాయి ఆలయ ప్రథమ వార్షిక వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని ముఖ్యఅతిధిగా హాజరై... ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వైభవంగా శిరిడిసాయి ఆలయ ప్రథమ వార్షికోత్సవం