ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పనిచేయని ఫాస్టాగ్​ ట్రాక్​... వాహనదారుల ఇబ్బందులు - ఫాస్టాగ్ ట్రాక్ విధానం వార్తలు

కృష్ణా జిల్లా కీసర ,చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ట్రాక్ విధానం పనిచేయలేదు. దీని వల్ల ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం టోల్​ ప్లాజా నిర్వాహకులు క్యాష్​ కౌంటర్ల ద్వారా టోల్​ వసూలు చేశారు.

fastag not working at krishna district
పనిచేయని ఫాస్టాగ్ ట్రాక్ విధానం

By

Published : Dec 15, 2019, 4:43 PM IST

ఫాస్టాగ్​ పనిచేయక వాహనదారుల ఇబ్బందులు

కృష్ణా జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద రెండు ఫాస్టాగ్ ట్రాక్ లైన్లు, రెండు క్యాష్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఫాస్టాగ్ ట్రాక్ సరిగా పనిచేయక పోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు ఒక్కసారిగా క్యాష్​ కౌంటర్ల వైపు మొగ్గు చూపడం వల్ల ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే ఫాస్టాగ్ స్టిక్కర్ వేయించుకున్న వాహనాలను టోల్ గేట్​లో సరిగా గుర్తించటం లేదు. అలాగే చిల్లకల్లు టోల్​ ప్లాజా వద్ద సైతం పాస్ట్​ టాగ్​లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తమ వాహనాలకు కొత్తగా ఫాస్టాగ్ స్టిక్కర్ వేయించుకునే వారికి చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద రెండు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అనంతరం క్యాష్​ కౌంటర్ల ద్వారా నిర్వాహకులు టోల్​ వసూలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details