Farmers problems with fishes: కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని పెదప్రోలు, కప్తానుపాలెం, కాసానగర్ గ్రామాల్లోని రైతులను చేపలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. వారం రోజుల క్రితం విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి.. వరి పంట సాగు కోసం నీరు విడుదల చేశారు. ఆ నీళ్లతో పాటు పెద్ద పెద్ద చేపలు కూడా పొలాల్లోకి వచ్చి చేరాయి. పొలాల్లో కూడా నీళ్లు ఎక్కువగా ఉండటంతో అక్కడే తిరుగుతూ.. నారుమళ్లని నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ కూలీలను సైతం గాయపరుస్తున్నాయని.. నాట్లు వేయడానికి కూడా కూలీలు జంకుతున్నారని వారు అంటున్నారు.
'బాబోయ్ చేపలు.. పొలాలన్నీ పాడు చేస్తున్నాయి'
Farmers problems with fishes: ఎక్కడైనా చేపలు తక్కువ ధరకు దొరికితేనే ఎవరూ ఆగరు.. అలాంటిది ఉచితంగా దొరికితే ఇక ఆగుతారా.. కానీ.. నీళ్లలోకి కొట్టుకొచ్చిన చేపల వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులంటే ఆశ్చర్యమే కదా. అలాంటి ఘటనే.. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో జరిగింది.
పొలాల్లోకి వచ్చి చేరిన మీనాలు.. రైతుల ఇబ్బందులు