రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ప్రభుత్వం ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచి చికిత్స అందిస్తోంది. ఎవరూ వారిని కలవకుండా నిబంధనలను విధించింది. ఇందుకు విరుద్ధంగా కృష్ణా జిల్లా నందిగామలో కరోనా బాధితుడిని అతని కుటుంబ సభ్యులు కలిశారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని వారి స్వగృహంలో స్వీయ నిర్బంధంలో ఉంచారు.
కరోనా బాధితుణ్ని కలిశారు.. అధికారులు హోం క్వారంటైన్ చేశారు - కృష్ణా జిల్లాలో లాక్డౌన్ ప్రభావం
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సురంపల్లికి చెందిన ఓ కరోనా బాధితుడిని అతని కుటుంబ సభ్యులు కలిశారు. విషయం తెలుసుకున్న అధికారులు.. ముందస్తు చర్యల్లో భాగంగా వెంకటనరసింహపురంలోని వారి స్వగృహంలో స్వీయ నిర్బంధంలో ఉంచారు.
హోం క్వారంటైన్లో కరోనా బాధితుని కుటుంబీకులు