కృష్ణా జిల్లా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన బియ్యానికి బ్యాంకు గ్యారంటీగా ఇచ్చిన బాండ్ల విడుదలకు నకిలీ లేఖలను సృష్టించిన ఇద్దరు రైస్ మిలర్లపై గవర్నర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
రైస్ మిల్లర్లు ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి దానికి సంబంధించిన బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు పంపిస్తారు . దీని నిమిత్తం రైస్ మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు కొంత సొమ్ము గ్యారంటీ చూపించాల్సి ఉంటుంది. బియ్యం సరఫరా పూర్తయిన తరువాత గ్యారంటీ సొమ్మును వెనక్కి ఇస్తూ జిల్లా పౌరసరఫరాల శాఖ రైస్ మిల్లర్లకు ఒక లేఖ ఇస్తారు. లేఖను బ్యాంకు సమర్పించి తాము గ్యారంటీగా ఇచ్చిన సొమ్మును రైస్ మిల్లర్లు వెనక్కి తీసుకుంటారు.