కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలో వైకాపా నేతల అండదండలతో నిత్యం వందలాది లారీల ఇసుక అక్రమంగా తరలిపోతోందని మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఆరోపించారు. అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా నదిలో యంత్రాలు, డంపర్లతో ఇసుకను బయటకు తరలిస్తున్న వైనంపై దృష్టి పెట్టాలన్నారు. వాల్టా నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయాల్లో ప్రొక్లైన్తో ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం ప్రకటించిన ఆన్లైన్ విధానంలో బుకింగ్ ద్వారా ఇసుకను వినియోగదారులకు అందించాల్సి ఉండగా.. ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని సౌమ్య మండిపడ్డారు. జీపీఎస్ అమర్చుకున్న లారీలకు మాత్రమే ఇసుక లోడింగ్ చేయాలన్న నిబంధనలను ఎక్కడా పాటించడం లేదని విమర్శించారు. అధికారులు స్పందించి అక్రమ ఇసుక దందాను అరికట్టకపోతే.. ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని సౌమ్య హెచ్చరించారు.