ఖాకీ ఆపింది... కిక్కు దిగింది
రోడ్డు ప్రమాదాల నివారణకు ఉపక్రమించిన పోలీసులు... విజయవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మందు తాగి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
విజయవాడ గాంధీనగర్లో పోలీసులు అర్ధరాత్రి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. కార్లలో వెళ్తున్న వారిని ప్రత్యేకంగా ఆపి పరీక్షలు చేశారు. ఈ డ్రైవ్‌లో 10కిపైగా మద్యం తాగి వాహనాలునడిపే వారిని గుర్తించి... కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారని... వాటిని నివారించేందుకే తనిఖీలు చేపట్టామని పోలీసులు తెలిపారు.