వైట్ ఘాట్, ఎబ్రో, వైట్ స్పాట్ వంటి వ్యాధులు వనామి రొయ్యలకు సోకటంతో...ఆశించిన పెట్టుబడి రాక దివిసీమ ఆక్వా రైతులు నష్టాలు బారిన పడ్డారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో మత్స్యశాఖ కార్యాలయం ఉన్నా... అక్కడి అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవనిగడ్డలో ఆక్వా కల్చర్ కోసం ప్రత్యేకమైన ల్యాబ్ నిర్మాణానికి శిలాఫలకం వేశారు. కానీ ల్యాబ్ నిర్మాణానికి ఇంత వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. రొయ్యల చెరువుల్లో నీటి పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్లు ఆశ్రయించటం సాధ్యంకాదని వాపోయారు. చౌడు భూముల్లోనూ రొయ్యలు సాగు చేసి వాటిని విదేశాలకు ఎగుమతి చేసి దేశానికి కోట్ల రూపాయల విదేశక మారక ద్రవ్యం తెచ్చిపెట్టామని గుర్తు చేశారు. వనామి రొయ్యలకు వచ్చే వ్యాధుల నివారణకు ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆక్వా రైతులు కోరారు.
అప్పుల బారిన ఆక్వా రైతులు... ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు
రొయ్యల ఎగుమతితో ఒకప్పుడు దేశానికి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టిన దివిసీమ ఆక్వా రైతులు... నేడు అప్పుల బారిన పడ్డారు. రొయ్యలకు వచ్చే వ్యాధులతో...పెట్టుబడులు రావేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులను నివారించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
అప్పుల బారిన పడిన దివిసీమ ఆక్వా రైతులు