ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లబ్ధిదారులుకు పట్టాలు అందించిన అనంతరం..కొన్ని చోట్ల గృహ నిర్మాణాల శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.

distribution of house sites
ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం

By

Published : Dec 29, 2020, 10:05 PM IST

కృష్ణాజిల్లా అంబర్​పేట గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే మొండితోక జగన్​మోహన్​రావు అందించారు. నందిగామ మండలం కమ్మవారిపాలెంలో దివంగత నేత రాజశేఖర్​రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పట్టాల పంపిణీ చేపట్టారు. గ్రామంలోని తొంభై ఐదు మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించి.. గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

విశాఖ జిల్లా :

నర్సీపట్నం నియోజకవర్గంలోని ధర్మసాగరం గ్రామంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్​ పాల్గొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా నూతన పరిపాలనా విధానానికి సీఎం జగన్​ శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పట్టాలు పొందినవారు సొంతిల్లు నిర్మాణానికి సన్నాహాలు చేసుకోవాలని.. ప్రభుత్వం సాయం చేస్తుందని నర్సీపట్నం సబ్ కలెక్టర్ అన్నారు.

చోడవరం:

రాష్ట్రంలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ప్రతిపక్షాల లక్ష్యమని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. సీఎం చేసే మంచి పనులను సహించలేక ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రావికమతం మండలం గొంప, మర్రిపాక, గుడివాడ, తట్టబంధ, గుడివాడ, తోటకూర పాలెం తదితర గ్రామాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా :

ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. మండల పరిధిలోని తుంపర్తి ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన లేఅవుట్లలో లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. వెయ్యి మందికి పైగా అర్హులు ఇళ్ల స్థలాలు పొందారు.

కర్నూలు జిల్లా:

జిల్లాలోని రుద్రవరం గ్రామంలో 380 ఎకరాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఇచ్చిన హామీలను నేరవేర్చిన ఘనత సీఎం జగన్​కే చెందుతుందని ఆయన అన్నారు.

ఇదీ చదవండి:

ఇళ్ల స్థలాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలి: చెంగల్రాయుడు

ABOUT THE AUTHOR

...view details