డీజీపీ గౌతం సవాంగ్, రాష్ట్ర పొలీస్ టెక్నికల్ ఇంఛార్జ్ డీఐజీ పాలరాజులు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. ఉత్తమ డీజీపీ అవార్డు అందుకున్నందుకు డీజీపీను గవర్నర్ అభినందించారు. పోలీసులు వాడుతున్న సాంకేతికత వివరాలను.. గవర్నర్ తెలుసుకున్నారు. పోలీసులకు వేస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్‌పై ఆరా తీశారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్ధితుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ కేంద్ర స్థాయి అవార్డులు సాధించడం పట్ల గవర్నర్ బిశ్వభూషన్ ఆనందం వ్యక్తం చేశారు.
రాష్ట్ర పోలీసులకు జాతీయ పురస్కారాలపై గవర్నర్ హర్షం - కొవిడ్ పై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తాజా వార్తలు
గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను డీజీపీ గౌతం సవాంగ్, రాష్ట్ర పొలీస్ టెక్నికల్ ఇంఛార్జ్ డీఐజీ పాలరాజులు రాజ్‌భవన్‌లో కలిశారు. కొవిడ్ వ్యాక్సినేషన్, రాష్ట్రంలో కొవిడ్ పరిస్ధితులపై గవర్నర్ ఆరా తీశారు.
గవర్నర్‌తో డీజీపీ, రాష్ట్ర పొలీస్ టెక్నికల్ ఇంఛార్జ్ డీఐజీ సమావేశం