ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కర్ఫ్యూ సమయంలో ప్రయాణాలకు అనుమతి పొందాలి'

By

Published : May 10, 2021, 7:41 PM IST

Updated : May 10, 2021, 7:50 PM IST

కర్ఫ్యూ సమయంలో ప్రయాణాలకు అనుమతి పొందాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. అత్యవసర ప్రయాణమైతేనే ఈ పాస్ వాడాలని తెలిపారు. ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

dgp
డీజీపీ గౌతమ్ సవాంగ్

కర్ఫ్యూ సమయంలో ప్రయాణాలకు అనుమతి పొందాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.ఇకపై రాష్ట్రంలోకి రావాలంటే ఈపాస్ లు తప్పనిసరని వెల్లడించారు.ప్రస్తుతం రాష్ట్రంలో మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని.. . కర్ఫ్యూ సమయంలోఇతర రాష్ట్రాలు, అంతర్ జిల్లాలో ప్రయాణానికి ఈ పాస్ లు తీసుకోవాలని ఆయన సూచించారు.

అత్యవసర ప్రయాణం చేసే వాళ్లు సిటిజన్ సర్వీస్ పోర్టల్(http://appolice.gov.in), ట్విట్టర్ (APPOLICE100), ఫేస్ బుక్ (@ANDHRAPRADESHSTATEPOLICE) ద్వారా ఈపాస్ పొందవచ్చన్నారు .అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వాళ్లు పూర్తి ధ్రువపత్రాలతో ఈ-పాస్​కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శుభకార్యాలు, అంతక్రియలు చేసేవాళ్లు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణం మేరకు సంబంధిత స్థానిక అధికారుల వద్ద అనుమతి పొందాలని డీజీపీ కోరారు.

ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు . కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని డీజీపి సూచించారు . అంతర్రాష్ట్ర కదలిక లపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు కొనసాగుతాయన్నారు.

ఇదీ చూడండి.

'104 వ్యవస్థ మరింత బలోపేతం కావాలి'

Last Updated : May 10, 2021, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details