అమరావతి రాజధానికి మద్దతుగా నందిగామలో 53వ రోజు రైతుల రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. రైతుల దీక్షకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రం నాశనమవుతుందని విమర్శించారు. రాజధానిని కాపాడుకునేందుకు ప్రజా, న్యాయ పోరాటాలను కొనసాగిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రాజధాని కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
'అమరావతి కోసం ప్రజా, న్యాయ పోరాటాలను కొనసాగిస్తాం'
రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు ప్రజా, న్యాయ పోరాటలను కొనసాగిస్తామని తెదేపా నేత దేవినేని ఉమా అన్నారు. నందిగామలో రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ఆయన మద్దతు తెలిపారు.
devineni umma support to farmers at nandigama