ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దళారులను అరికట్టాల్సిందిపోయి.. వ్యవస్థను వారికే అప్పజెప్పారు: దేవినేని

రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామని పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలిచ్చిన ప్రభుత్వం..రైతులను గాలికొదిలేసిందని మాజీమంత్రి దేవినేని ధ్వజమెత్తారు. దళారులను అరికట్టాల్సిన ప్రభుత్వం...మొత్తం వ్యవస్థను దళారులకే అప్పజెప్పిందని విమర్శించారు.

దళారులను అరికట్టాల్సిందిపోయి
దళారులను అరికట్టాల్సిందిపోయి

By

Published : Nov 24, 2020, 10:52 PM IST

దళారులను అరికట్టాల్సిన ప్రభుత్వం.. మొత్తం వ్యవస్థనే దళారులకు అప్పజెప్పిందని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. కృష్ణాజిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడులో నిర్వహించిన పసుపు చైతన్యం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. చేతికొచ్చిన పంట అకాల వర్షంతో తడిసి రైతుకు తీరని కష్టాన్ని మిగిల్చిందని దేవినేని అన్నారు. పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయ పంటలన్నీ అకాల వర్షాల కారణంగా రైతులకు నష్టాలను తీసుకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామని పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలిచ్చిన ప్రభుత్వం..రైతులను గాలికొదిలేసిందని దేవినేని ధ్వజమెత్తారు. తడిసిన పంటలను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి పంటను వెంటనే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడతామంటూ సంతకాల కోసం వస్తే ఎవరు సంతకాలు పెట్టొద్దని రైతులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details