ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Devineni Uma: 'ఆ అంశంపై మాట్లాడటానికి సజ్జల ఎవరు..?'

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై సంబంధిత మంత్రులు మాట్లాడకుండా.. సజ్జలతో మాట్లాడిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆక్షేపించారు. ఈ అంశంపై మాట్లాడటానికి సజ్జల ఎవరని ప్రశ్నించారు.

Devineni Uma
Devineni Uma

By

Published : Jul 5, 2021, 8:36 PM IST

కృష్ణా నదీ జలాలపై తెలంగాణ మంత్రులు ఇష్టారీతిగా మాట్లాడుతుంటే..వైకాపా ప్రభుత్వం నోరుమెదపటం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. జల వివాదంపై సంబంధిత మంత్రులు మాట్లాడకుండా..సజ్జలతో మాట్లాడిస్తున్నారని ఆక్షేపించారు. ఈ అంశంపై మాట్లాడటానికి సజ్జల ఎవరని ప్రశ్నించారు. వైఎస్​ను నోటికొచ్చినట్లు తిడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, విల్లాలు కాపాడుకోడానికే వారు నోరు మెదపడం లేదని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details