'తెదేపా నేతలపై జరిగే దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలి' - తెదేపాపై దాడులు
రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నాయకులు, కార్యకర్తలపై జరిగే దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలుగు యువత నాయకుడు దేవినేని అవినాష్ అన్నారు. తమ నాయకుడు చంద్రబాబు ఆదేశాల ప్రకారం ప్రతి ప్రాంతానికి వెళ్లి శ్రేణులకు మనో ధైర్యం కల్పిస్తున్నామని అన్నారు.
devineni_avinash_fires_on_ycp
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం మాలకాపురంలో దాడులకు గురైన నాయకులను మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఇంట్లో దేవినేని అవినాశ్ పరామర్శించారు. తెదేపా ప్రభుత్వం హయాంలో మచ్చుకైనా దాడులు, అక్రమ కేసులు లేవని..వైకాపా అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ చూపి దాడులను నియంత్రించకపోతే..కార్యకర్తలు సంయమనం కోల్పోతారని తెలిపారు.