ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

By

Published : Aug 4, 2019, 11:01 AM IST

బంగాళాఖాతం

రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ఇప్పటికే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వీటికి తోడుగా రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో ఇప్పటికే రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయి. తెలుగురాష్ట్రాలతో పాటు... ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా లోనూ రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు సూచిస్తున్నాయి. శబరి, గోదావరి, ఇంద్రావతి నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. నదుల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని సూచించింది. విశాఖ , విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని సూచించింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details