కృష్ణా జిల్లా అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ పర్యటించారు. కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో ప్రజారవాణా విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఘంటసాల మండల పరిధిలోని కొడాలి జంక్షన్ వద్ద పరిస్థితిని సమీక్షించారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు.
వారి సేవలు ఇలాగే కొనసాగించాలి..
అనంతరం ప్రధాన కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శులతో మాట్లాడారు. అనంతరం వారి సేవలను కీర్తిస్తూ ఇలాగే కొనసాగించాలని సూచించారు. చల్లపల్లి సెంటర్లోని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఉన్న చెక్ పోస్టును సైతం ఎస్పీ తనిఖీ చేశారు. రాకపోకలు సాగిస్తున్న వాహనాలను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నియమాలు పాటించాలని… ప్రజలంతా సహకరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అవని గడ్డ డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కృష్ణపట్నం చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్