పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థ జలాల రీసైక్లింగ్ అండ్ రిసోర్స్ రికవరీ ప్రాజెక్టుపై బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు. పట్టణాల్లో వ్యర్థ జలాల రీసైక్లింగ్‌తోపాటు మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వీటిపై ప్రణాళిక రూపొందించాలని మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులను సీఎస్ కోరారు. ఘన వ్యర్థాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై... జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆసక్తి కనబరుస్తూ నివేదిక కోరిందని తెలిపారు. రాష్ట్రంలోని 71 పట్టణాల్లో ఈ ప్రాజెక్టును త్వరితగతిన చేపట్టి... వాటిని పరిశుభ్రమైనవిగా తీర్చిదిద్దాలని మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు సూచించారు. ఈ ప్రాజెక్టుకు గుర్తించిన స్థలాలను... ఆగస్టు 10వ తేదీలోగా అప్పగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీడియా సహాయంతో... ప్రజలు, ప్రజాప్రతినిధులకు అవగాహన కలిగిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఈ కార్యక్రమం అమలుకు వినియోగిస్తామని స్పష్టం చేశారు.
వ్యర్థ జలాల రీసైక్లింగ్‌పై...గేట్స్ ఫౌండేషన్‌తో సీఎస్ భేటీ
వ్యర్థ జలాల రీసైక్లింగ్ అండ్ రిసోర్స్ రికవరీ ప్రాజెక్టుపై బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ కోరారు
బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎస్ భేటీ