నందిగామ నగర పంచాయతీ పరిధిలో నెల రోజుల తర్వాత మొదటి డోస్ కొవిఫీల్డ్ వ్యాక్సిన్ వేస్తుండటంతో.. ప్రజలు భారీగా తరలివచ్చారు. నగర పంచాయతీ కమిషనర్ జయరామ్ ఆధ్వర్యంలో 400 మందికి టీకా వేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 45 ఏళ్లకు పైబడిన, ఎంపిక చేసిన వారికి టీకాలు వేసేందుకు.. నగర పంచాయతీ అధికారులు ముందుగానే స్లిప్పులు పంపిణీ చేశారు.
టీకా వేయించుకునేవారికి సమయాన్ని కూడా సూచించారు. దీని ప్రకారం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఉదయం 7 గంటల నుంచి భారీగా జనం తరలివచ్చారు. టీకా కోసం క్యూలైన్లో వేచి ఉండాల్సి రావటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.