ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ - విజయవాడ క్రైమ్ వార్తలు

విజయవాడలో ఆన్​లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి బెట్టింగ్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని తూర్పుగోదావరి జిల్లా వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

cricket betting gand arrest in vijayawada
విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

By

Published : Sep 20, 2020, 3:11 PM IST

విజయవాడలో ఆన్​లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొగల్రాజపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితుల్నిఅరెస్ట్ చేశారు. వారంతా తూర్పుగోదావరి జిల్లా వాసులుగా గుర్తించారు. విజయవాడ డీసీపీ హర్షవర్ధన్ ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు.

'అవతార్' అనే యాప్ ద్వారా ఆన్​లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ కోసం వినియోగించిన లైన్ బాక్స్, 25 సెల్​ఫోన్స్, ఎల్​సీడీ మానిటర్, లాప్​టాప్​లను స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశాం. ప్రధాన సూత్రధారి నవీన్‌ను త్వరలో అదుపులోకి తీసుకుంటాం. రూ.12 లక్షల వరకు బెట్టింగ్ జరిగిందని సమాచారం ఉంది. బెట్టింగ్‌పై సమాచారం ఇచ్చి ప్రజలు సహకరించాలి. విద్యార్థులు బెట్టింగ్‌లకు ఆకర్షితులు కావద్దు' అని డీసీపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details