అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడినందున ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాగునీటి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ నెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడడం మంచి పరిణామం అన్నారు.
చర్చలతో జల వివాదాలను పరిష్కరించుకోవాలి: రామకృష్ణ
చర్చల ద్వారా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జల వివాదాలను పరిష్కరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. జగన్, కేసీఆర్ వైఖరి వల్ల రాయలసీమ నష్టపోతోందని అన్నారు.
cpi ramakrishna
గోదావరి, కృష్ణా నదుల వరద నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. ఈ రెండు నదుల్లో పుష్కలంగా ఉన్న నీటిని సరైన రీతిలో వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వైఖరి వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. తమ మధ్య భేషజాలకు తావులేదన్న కేసీఆర్, జగన్... రెండు తెలుగు రాష్ట్రాల్లో కరవు ప్రాంతాలకు నీరు అందించి రైతులను ఆదుకోవాలి- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి