ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం.. ఆందోళనలో ఆలయ సిబ్బంది - విజయవాడ కనకదుర్గ ఆలయం వార్తలు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా భయం పట్టుకుంది. ఈవోతో సహా పలువురికి పాజిటివ్ నిర్ధరణ కావటంతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో భక్తుల దర్శన వేళలు మార్చారు.

corona virus spread in vijayawada kanaka durga temple
ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం

By

Published : Aug 7, 2020, 5:00 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయ సిబ్బందికి కరోనా భయం పట్టుకుంది. ఆలయ కార్యనిర్వహణ అధికారి సురేశ్ బాబుకు పాజిటివ్ రావటంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం ఆయన పాలకమండలి సమావేశంలో పాల్గొన్నారు. దీంతో ఈవోతో సన్నిహితంగా మెలిగిన వారంతా హోం క్వారంటైన్​లో ఉన్నారు.

అమ్మవారి ఆలయంలో భక్తుల దర్శన వేళల్లో మార్పులు చేశారు. నేడు శ్రావణ శుక్రవారం అయినందున అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆలయ సిబ్బందిలో కొందరికి కరోనా రావడం... ఈవో ఆసుపత్రిలో చేరడం.. ఓ వేదపండితుడు మృతి చెందడం వల్ల సిబ్బంది భయపడుతున్నారు. భక్తులను క్షుణ్నంగా తనిఖీ చేయటంతోపాటు ఎక్కువసేపు ఆలయ పరిసరాల్లో ఉండకుండా పంపించేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details