అమరావతి రాజధాని రైతుల నిరసనలు 250వ రోజుకు చేరుకున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 'రాజ్యాంగాన్ని గౌరవిద్దాం .. అమరావతిని కాపాడుకుందాం' అంటూ సమావేశం నిర్వహించారు. విజయవాడలోని జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్, న్యాయదేవత చిత్రపటాలకు వినతిపత్రం అందజేశారు.
రాజధాని ఉద్యమం కేవలం 29 గ్రామాలది కాదని, రాష్ట్ర ప్రజలందరిదీ అని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు అమరావతికి మద్దతు పలికిన సీఎం జగన్.. నేడు మాట మార్చటం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.