'అభివృద్ధి పేరుతో కక్ష సాధింపు చర్యలు'
పంచాయతీ ఎన్నికల అనంతరం అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు గ్రామంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పతున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కృష్ణా జిల్లా వత్సవాయి మండలం భీమవరంలో జరిగింది.
కృష్ణా జిల్లా వత్సవాయి మండలం భీమవరంలో పంచాయతీ ఎన్నికల అనంతరం కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మురుగునీటి కాలువ అభివృద్ధి పేరుతో బీసీ కాలనీలోని ఇంటి ప్రహరీ గోడలను కూల్చేస్తామంటూ.. అధికార పార్టీకి చెందిన నాయకుడు బెదిరింపులకు దిగినట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ప్రహరీ గోడలను కూల్చేస్తే తాము పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని పురుగుమందు, పెట్రోల్ బాటిళ్లతో నిరసన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల క్రితమే నిర్మించిన డ్రైన్లు ఉండగా.. మురుగునీటి కాలువ అభివృద్ధి పేరుతో చర్యలకు దిగటం అన్యాయమని స్థానికులు వాపోతున్నారు.