కృష్ణాజిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, సర్వీస్ ఓట్లు లెక్కింపు చేస్తామనీ.. అనంతరం ఈవీఎంల ఓట్లు లెక్కిస్తామని తెలిపారు. మధ్యాహ్నంలోపే పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందనీ...లెక్కింపునకు సంబంధించి సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందనీ.. పోలింగ్ ఏజెంట్లు ప్రభుత్వం అందించే గుర్తింపు కార్డులు చూపిస్తేనే లోపలికి అనుమతిస్తామని స్పష్టంచేశారు.
కృష్ణాజిల్లాలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ - counting
"కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, సర్వీస్ ఓట్లు లెక్కిస్తాం. అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది."-- కలెక్టర్ ఇంతియాజ్
కృష్ణా జిల్లాలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్