ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనవరి చివరి నాటికి... అందుబాటులోకి దుర్గగుడి ఫ్లైఓవర్..!

విజయవాడ ప్రజలకు త్వరలోనే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని... జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. అనుకున్న సమయానికి దుర్గగుడి వద్ద పై వంతెన పనులు పూర్తి చేయాలని గుత్తేదారును ఆయన ఆదేశించారు.

fly over

By

Published : Nov 20, 2019, 7:11 PM IST

మీడియాతో మాట్లాడుతున్న కలెక్టర్ ఇంతియాజ్

దుర్గగుడి వద్ద పై వంతెన పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి... జనవరి నెలాఖరు నాటికి నగరవాసులకు అందుబాటులోకి తీసుకొస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. పై వంతెన పనులు చేస్తున్న సంస్థ సోమా కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆయన పురోగతిని పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, మిగిలిన పనుల వివరాలను సోమా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేసి... ప్రజలకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే పలుమార్లు దుర్గగుడి వద్ద పైవంతెన నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details