కొవిడ్ మహమ్మారి కారణంగా తెలంగాణలో మూతబడిన బడులను తెరిచే విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. రాష్ట్రంలో పాఠశాలల్ని త్వరగా పునఃప్రారంభించాలన్న సమాచారం పెద్దఎత్తున కలకలం రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాలల ప్రారంభంపై క్లారిటీ ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలిసి కొన్ని రోజుల పాటు ప్రత్యక్ష తరగతులను వాయిదా వేయాలని, కొన్నాళ్లపాటు ఆన్లైన్ తరగతులు కొనసాగించాలని కోరారు. రోజుకు సగం మంది ఉపాధ్యాయులే హాజరయ్యేలా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించారని సంఘం ప్రతినిధులు తెలిపారు.
ONLINE CLASSES: ప్రత్యక్ష తరగతులు వాయిదా..తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం - ts offline classes news
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాలల ప్రారంభంపై క్లారిటీ ఇచ్చారు. కొన్నాళ్ల పాటు ఆన్లైన్ తరగతులను కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు సీఎంని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ ప్రతిపాదనకు ఆయన ఒప్పుకున్నారని జులై 1 నుంచి ఆన్లైన్ బోధనకు సీఎం అంగీకారం తెలిపారని వారు వెల్లడించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్
ప్రత్యక్ష తరగతులు వాయిదా వేస్తామని.. జులై 1 నుంచి ఆన్లైన్ బోధనకు సీఎం అంగీకారం తెలిపారని వారు వెల్లడించారు. పాఠశాలల ప్రారంభంపై తొందరలేదని ముఖ్యమంత్రి చెప్పారని పేర్కొన్నారు. రోజూ సగం మంది ఉపాధ్యాయులే విధులకు హాజయ్యేందుకు సీఎం అంగీకరించారని ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Katti Mahesh: నెల్లూరు ఆస్పత్రిలో కత్తి మహేష్‌కు చికిత్స.. తల, కళ్లకు తీవ్ర గాయాలు