రాజధాని మార్పుపై నేతల మధ్య వాడివేడి చర్చలు జరుగుతున్న తరుణంలో సీఎం జగన్ రాజధాని అమరావతిపై సమీక్షించాలని నిర్ణయించారు. ఈ నెల 29న రాజధాని విషయమై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల వ్యాఖ్యల నేపథ్యంలో...రాజధాని తరలిస్తారా, అక్కడే ఉంచుతారా అనే అంశాలపై ప్రజల్లో సందేహాలు నెలకొన్న తరుణంలో సీఎం సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ఎల్లుండి జరిగే సమావేశంలో రాజధానిపై ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
ఈ నెల 29న రాజధానిపై సీఎం జగన్ సమీక్ష
రాజధాని మార్పుపై మంత్రుల వ్యాఖ్యలు, ఆందోళనబాట పట్టిన రాజధాని రైతాంగం, ప్రజల్లో నెలకొన్న సందేహాల నేపథ్యంలో సీఎం జగన్ అమరావతిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 29న జరిగే ఈ సమావేశంలో రాజధానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ నెల 29న రాజధానిపై సీఎం జగన్ సమీక్ష