నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి.. లక్ష్మీనరసింహ నారాయణ యాగము నిర్వహించారు. కృష్ణాజిల్లా ముదినేపల్లిలోని తన స్వగృహంలో 18 మంది పురోహితులతో వైష్ణవి ఈ యాగం చేశారు. చంద్రబాబు మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెద్ద తిరుపతికి కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకుంటానని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం... పోలవరం నిర్మాణానికి తన వంతు సాయంగా ఎకరం పొలం కానుకగా ఇస్తానని వైష్ణవి స్పష్టం చేశారు.
చంద్రబాబే మళ్లీ సీఎం కావాలని యాగం
చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ... అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి యాగము నిర్వహించారు.
చంద్రబాబే మళ్లీ సీఎం కావాలని యాగం నిర్వహిస్తున్న అంబుల వైష్ణవి