జగ్గయ్యపేటలోని బుద్ధవిహార్ వద్ద ఏర్పాటు చేసిన సభలో మహిళలు సైతం ఉత్సాహంగా పాల్లొన్నారు. తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు అని కలెక్టర్ అన్నారు. ఊరిచెరువు, ఎర్రకాల్వ, వేపాలవాగు, విలియంపేట తదితర 8 ప్రాంతాలను ఎంపిక చేసి శుద్ధి కార్యక్రమం ప్రారంభించారు. ఆయా ప్రాంతాలకు ఇంఛార్జీలను నియమించారు. చిన్నారులతో ఆసక్తికరమైన నాటికలు వేయించారు. జిల్లా ప్రజలందరు కృష్ణమ్మ శుద్ధి సేవలో పాల్లొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ముందుతరాలను బతికిద్దామంటూ ప్రజలందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమాన్ని అభినందించిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుసహకారం అందించేందుకు అంగీకరించారు.
నేను సైతం జగ్గయ్యపేట శుద్ధి సేవలో
"నేను సైతం కృష్టమ్మ శుద్ది సేవలో" అంటూ చేపట్టిన కార్యక్రమానికి విపరీతమైన స్పందన వస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఆకాంక్షిస్తున్నారు. జగ్గయ్యపేట పట్టణంలో "నేను సైతం జగ్గయ్యపేట శుద్ధిసేవలో" కార్యక్రమాన్ని కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు.
బుద్దవిహార్