విద్యార్థులకు కేవలం పుస్తక పరిజ్ఞానమే కాకుండా,కళలు,వినోదంతో కూడిన విజ్ఞానాన్ని అందించేందుకు క్రాప్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తోన్న కృషికి విశేష ఆదరణ లభిస్తోంది.విద్యార్థుల్లో కళల్లో ఆసక్తిని పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖతో కలిసి విజయవాడలో ప్రభుత్వ,ఎయిడెడ్ పాఠశాలల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.పటమటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పెయింటింగ్ లో శిక్షణ ఇచ్చారు.ప్రాచీన కళల్లో పేరొందిన చేరియల్ పెయింటింగ్,చింతపిక్కల పొడి,రంపం పొట్టు,కాగితం,సహజసిద్ధమైన రంగులు ఉపయోగించి వివిధ రకాల మాస్కులు ఎలా తయారు చేస్తారో శిక్షణ ఇచ్చారు.
చిత్రలేఖనంపై విద్యార్థులకు శిక్షణ - craft council of ap
విజయవాడలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనంపై క్రాప్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన శిక్షణ పై విద్యార్దులు ఆసక్తిని ప్రదర్శించారు.
శిక్షణ