Ghattamaneni Ramesh babu:ఘట్టమనేని రమేష్ బాబు మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. సీనియర్ నటుడు కృష్ణ కుమారుడైన రమేష్ బాబు... నటునిగా, నిర్మాతగా పని చేశారని గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో రమేష్‌బాబు కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
టాలీవుడ్ హీరో, నిర్మాత, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తనయుడు రమేశ్ బాబు మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నానంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. పుత్రశోకంలో వున్న కృష్ణకి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.