ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధి 'ముద్ర' - ఇదే గెలుపు మంత్ర...!

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోయినా... ప్రజా సమస్యలు పట్టించుకోకపోయినా అభివృద్ధికి ఎక్కడా లోటు రాలేదని చెబుతున్నారు అధికార పార్టీ నేతలు. నిధుల విడుదలలో విపక్ష చూపారనే ఆరోపణలు తిప్పి కొట్టి, చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు నూజివీడు నియోజకవర్గం తెదేపా నేతలు.

By

Published : Mar 26, 2019, 8:58 PM IST

అభివృద్ధి 'ముద్ర' - ఇదే గెలుపు మంత్ర...!

అభివృద్ధి 'ముద్ర' - ఇదే గెలుపు మంత్ర...!
బాబు పాలన ఇది
అభివృద్ధి సాధకుడు చంద్రబాబు పరిపాలనలో వివక్షకు తావుండదని తేల్చిచెబుతున్నారు కృష్ణా జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం నేతలు, ప్రజలు. గత ఎన్నికల్లో తెలుగుదేశానికి అవకాశం ఇవ్వకపోయినా... ఎన్నుకున్న వైకాపా ఎమ్మెల్యే ప్రజాసమస్యలు శాసనసభలో ప్రస్తావించకున్నా న్యాయం చేశామంటున్నారు ఇక్కడి నాయకులు.

అభివృద్ధి పథం
నిధులు విడుదలలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పట్ల పక్షపాతం చూపుతున్నారనే విమర్శలను తిప్పికొడుతున్న తెలుగుదేశం నేతలు... చేసిన పనులను ఏకరవు పెడుతున్నారు. ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో.... నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి తగినంత నిధులు మంజూరయ్యాయని చెప్పారు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌ఛార్జ్‌ ముద్రబోయిన వెంకటేశ్వరరావు.

సంతృప్త స్థాయి

55వేల 551మంది డ్వాక్రా మహిళలకు...45 కోట్ల 15 లక్షల మేర రుణమాఫీ జరిగిందని లెక్కలు చూపిస్తున్నారు నియోజకవర్గ నేతలు. చంద్రన్న బీమా పథకం ద్వారా 749 మందికి 7కోట్ల 4లక్షల రూపాయలు ఇచ్చామని పేర్కొంటున్నారు. చంద్రన్న బాట కింద 35కోట్లతో 102 కిలోమీటర్ల మేర తార రోడ్డు వేయించినట్టు రుజువులు చూపుతున్నారు. స్వచ్చాంధ్ర కింద 27 కోట్లతో నిర్మించిన 17వేల 787 మరుగుదొడ్లు వివరాలు వెల్లడించారు ముద్రబోయిన వెంకటేశ్వరరావు. నూజివీడు నియోజకవర్గంలోని జరిగిన పనులపై స్థానికులూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈసారి తప్పు చేయొద్దు

నూజివీడును మామిడి మార్కెటింగ్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యమంటున్న ముద్రబోయిన...ఈసారి తనకు అవకాశమివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details