కృష్ణా జిల్లా నూజివీడు బస్ స్టాండ్ వద్ద మహిళ మెడలోంచి గొలుసు దొంగిలించి(chain snatchers) పారిపోతున్న ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు(chain snatchers arrest) అప్పగించారు. సమతనగర్ రోడ్డులో ఇద్దరు యువకులు.. ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళ మెడలో గొలుసు, పర్సును లాక్కొని పారిపోతున్నారు. బాధిత మహిళ కేకలు వేయడంతో స్థానికులు ఆ యువకులను పట్టుకున్నారు. దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆ ఇద్దరు తెలంగాణలోని ఖమ్మం ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
chain snatchers: గొలుసు దొంగలకు స్థానికుల దేహశుద్ధి - మహిళ మెడలోంచి గొలుసు దొంగిలించి పారిపోతున్న ఇద్దరు యువకులు అరెస్టు
కృష్ణా జిల్లా నూజివీడు బస్ స్టాండ్ వద్ద ఓ మహిళ మెడలోంచి గొలుసు, పర్సు దొంగిలించి పారిపోతున్న ఇద్దరిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
గొలుసు దొంగలకు దేహశుద్ధి చేసిన స్థానికులు