గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల వేతన చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1853 కోట్లను విడుదల చేసిందని పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఇందులో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి రూ. 452 కోట్ల, షెడ్యూల్డు తెగలకు రూ. 160 కోట్లు, ఇతరులకు రూ.1240 కోట్ల చొప్పున కేంద్రం విడుదల చేసినట్టు స్పష్టం చేసింది. ఈ మొత్తాలు ఎఫ్టీఓల నివేదికల ఆధారంగా నేరుగా లబ్దిదారుల ఖాతాలకు జమ అవుతాయని ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.
NREGA: కేంద్రం నుంచి ఉపాధి హామీ పథకం నిధులు విడుదల - wage payment వార్తలు
గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల వేతన చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1853 కోట్లు విడుదల చేసిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. లేబర్ బడ్జెట్ ప్రకారం 20 కోట్ల పని దినాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో... అదనంగా 6 కోట్ల పని దినాలను ఆమోదించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాశామని..ఆయన అన్నారు.
ఉపాధి హామీ పథకం
రాష్ట్రంలో ఆమోదించిన లేబర్ బడ్జెట్ ప్రకారం 20 కోట్ల పని దినాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. అదనంగా 6 కోట్ల పని దినాలను ఆమోదించాల్సిందిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రభుత్వం లేఖ రాసిందని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి.వేటపాలెం కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మోసం..రూ.22 కోట్ల పైనే సొమ్ము స్వాహా