ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విభజన హామీల్లోని పెండింగ్‌ అంశాలపై నేడు ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం.. విభజిత రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లోని పెండింగ్ అంశాలపై నేడు.. కేంద్ర కేబినెట్‌ సచివాలయం.. ప్రత్యేక సమీక్ష చేపట్టనుంది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న తరుణంలో.. తొలిసారి సమీక్ష నిర్వహిస్తోంది. కేబినెట్ సచివాలయంలోని.. కేంద్ర - రాష్ట్రాల సమన్వయ కార్యదర్శి నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనున్న ఈ సమావేశానికి.. రాష్ట్ర అధికారులు అందరూ హాజరు కావాలని.. కేబినెట్‌ సచివాలయ డైరెక్టర్‌.. గత నెల 31న ఏపీ సీఎస్‌కు లేఖ రాశారు.

special review of the pending issues in Division of Andhra Pradesh State
విభజన హామీల్లోని పెండింగ్‌ అంశాలపై నేడు ప్రత్యేక సమీక్ష

By

Published : Nov 23, 2022, 7:19 AM IST

ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం.. విభజిత రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లోని పెండింగ్ అంశాలపై నేడు.. కేంద్ర కేబినెట్‌ సచివాలయం.. ప్రత్యేక సమీక్ష చేపట్టనుంది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న తరుణంలో.. తొలిసారి సమీక్ష నిర్వహిస్తోంది. కేబినెట్ సచివాలయంలోని... కేంద్ర-రాష్ట్రాల సమన్వయ కార్యదర్శి నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనున్న ఈ సమావేశానికి.. రాష్ట్ర సంబంధిత అధికారులు అందరూ హాజరు కావాలని... కేబినెట్‌ సచివాలయ డైరెక్టర్‌.. గత నెల 31న ఏపీ సీఎస్‌కు లేఖ రాశారు. 2016 సెప్టెంబర్‌ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర పెండింగ్ అంశాలను.. 'E-సమీక్ష'లో అప్‌డేట్ చేయలేదని.., కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న అంశాల జాబితాను ఈ నెల మొదటి వారంలోగా అందించాలని... ఏపీ అధికారులను కేబినెట్ సెక్రటేరియట్ ఆదేశించింది. అదే సందర్భంలో... రాష్ట్రానికి సంబంధించి... కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖల్లో పెండింగ్‌ అంశాలను అందించాలని కూడా... మంత్రిత్వ శాఖలను కేబినెట్ సచివాలయం ఆదేశించింది.

వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన మొత్తం 34 పెండింగ్ అంశాలను అజెండాలో చేర్చిన కేంద్ర కేబినట్ సెక్రటేరియట్‌... వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. 2014 నుంచి 2016 సెప్టెంబర్‌ వరకు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి.. ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్‌, రాజధాని ఏర్పాటుకు ఆర్థిక సహకారం, హైదరాబాద్‌కు రాజధానిని అనుసంధానం చేయడం, ఎయిమ్స్‌ ఏర్పాటు, ఉన్నత విద్యాసంస్థల స్థాపన వంటి అనేక అంశాలు అజెండాలో ఉన్నాయి. 2016 సెప్టెంబర్ వరకే పెండింగ్ అంశాలపై 'E-సమీక్ష' ద్వారా తమ వద్ద వివరాలు ఉన్నట్లు సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్న కేబినెట్ సెక్రటేరియట్‌... 2019లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ వరకు... ఒక్క పెండింగ్ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదించలేదని వెల్లడించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details