వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సాన్ని పురస్కరించుకుని.. కృష్ణా జిల్లా నందిగామలో కన్యకాపరమేశ్వరీ దేవీ అమ్మ వారి ఆలయంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రవిశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన 'నిప్పుల గుండం' కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిపారవశ్యంలో మునిగితేలారు.
కన్యకాపరమేశ్వరీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు - కృష్ణా జిల్లా నందిగామ
కృష్ణ జిల్లాలోని నందిగామలోని కన్యకాపరమేశ్వరీ దేవీ అమ్మ వారి ఆలయంలో వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలకు మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కన్యకాపరమేశ్వరీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు