రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... తెదేపా మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు విజయవాడలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ ఓ పథకం ప్రకారం అమరావతిని చంపేయాలని ప్రయత్నిస్తున్నారని బొండా ఉమ ఆరోపించారు.
అర్హత, అనుభవం లేని బీసీజీ, జీఎన్ రావు కమిటీలు ఐదు కోట్ల ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీసేలా నివేదికలు ఇస్తున్నాయని మండిపడ్డారు. ఒక్క వైకాపా తప్పా అన్ని పార్టీలు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తున్నామని స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.