కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం జరిగింది. మందపాడుకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు అర్షా, ప్రేమ్ ప్రమాదవశాత్తు పంపుల చెరువులో పడి మృతి చెందారు. ఫొటో షూట్ చేసేందుకు స్నేహితులతో కలిసి చెరువు వద్దకు వెళ్లారు. ఫోటోలు తీస్తుండగా కాలు జారి చెరువులో పడిపోయారు.
ఈత రాకపోవడం వల్ల ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఉన్న స్నేహితులకు సైతం ఈత రాక వారిని కాపాడలేకపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని అన్నదమ్ముల మృతదేహాలు వెలికితీశారు. అర్షా ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, ప్రేమ్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు.