ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గన్నవరం నియోజకవర్గ కేడర్​ను ప్రశంసించిన సునీల్ ధియోదర్ - సునీల్ ధియోదర్ న్యూస్

కృష్ణా జిల్లా ఎనికేపాడులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జ్ సునీల్ ధియోదర్ ప్రారంభించారు. గన్నవరం నియోజకవర్గ పార్టీ కేడర్​ను ప్రశంసించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్ధికి భాజపా కృషి చేస్తోందని వెల్లడించారు.

Sunil Deodar
సునీల్ ధియోదర్

By

Published : Jun 28, 2021, 11:41 AM IST

విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జ్ సునీల్ ధియోదర్ ప్రారంభించారు. పార్టీ నేతలతో కలిసి మొక్కలు నాటారు. మొదట స్థానిక నేతలను పరామర్శించారు. అనంతరం గన్నవరం నియోజకవర్గ పార్టీ కేడర్​ను ప్రశంసించారు. దేశవ్యాప్తంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో భాజపా బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్ధికి భాజపా కృషి చేస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details