కృష్ణా జిల్లా ఉయ్యూరు శివాలయంలోని నవగ్రహ విగ్రహాలలో ఓ విగ్రహం చేయి విరిగిన ఘటనపై భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. కరోనా లాక్డౌన్కు ముందు పూజలు నిర్వహిస్తున్న సమయంలో... పొరపాటున విగ్రహం ధ్వంసమైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ వివరణపై ఆగ్రహం వ్యక్తం చేసిన భాజాపా నేతలు... తప్పును కప్పిపుచ్చేందుకే ఆలయ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
'తప్పును కప్పిపుచ్చేందుకే తప్పుడు సమాచారం ఇస్తున్నారు' - uyyuru latest protest
కృష్ణా జిల్లా ఉయ్యూరు విగ్రహం ధ్వంసం ఘటనపై భాజపా నేతలు నిరసన చేపట్టారు. ఈ ఘటనకు కారకులైన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లా ఉయ్యూరు విగ్రహం ధ్వంసం ఘటన