దేశంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఇవ్వాలనే ప్రధానమంత్రి ఆశయానికి.... గత తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుత వైకాపా ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని.... రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి కిలారు దిలీప్ ఆరోపించారు. పేదలకు ఇల్లు పంపిణీ చేయనందుకు నిరసనగా బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాలలో అవినీతి జరిగితే..... దర్యాప్తు చేసి బయటపెట్టాలని సూచించారు. నిర్మాణాలు పూర్తైన ఇళ్లను రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా.. తక్షణమే పేద వారికి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
'ప్రధాని ఆశయానికి గత, ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నాయి'
పేదలకు ఇళ్లు పంపిణీ చేయనందుకు నిరసనగా భాజపా అధికార ప్రతినిధి కిలారు దిలీప్ నిరసనకు దిగారు. నిర్మించిన ఇళ్లను రాజకీయాలకు అతీతంగా.. తక్షణమే పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
కిలారు దిలీప్ నిరసన