రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరిలోని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి గాలిగోపురం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. వర్తక వ్యాపారులు నిర్వహించిన ర్యాలీకి మంగళగిరిలోని రాజకీయ ఐకాస నేతలు మద్దతు తెలిపారు. రాజధానిగా ఈ ప్రాంతం అయితేనే అందరికీ అందుబాటులో ఉంటుందని వ్యాపారులు అభిప్రాయపడ్డారు. రైతుల పోరాటానికి మద్దతుగా ఉంటామన్నారు.
రాజధాని రైతులకు సంఘీభావంగా మంగళగిరిలో ర్యాలీ - అమరావతి రైతుల నిరసన వార్తలు
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ రాజధాని రైతులకు సంఘీభావంగా మంగళగిరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు.
రాజధాని రైతులకు సంఘీభావంగా మంగళగిరిలో బైకు ర్యాలీ